rama neyeda
ప. రామా నీయెడ ప్రేమ రహితులకు
నామ రుచి తెలుసునా ఓ సీతా (రా)
అ. కామిని వేష ధారికి సాధ్వీ నడత-
లేమైన తెలుసునా ఆ రీతి సీతా (రా)
చ. తన సౌఖ్యము తానెరుగకనొరులకు
తగు బోధన సుఖమా
ఘనమగు పులి గో రూపమైతే త్యాగ-
రాజ నుత శిశువుకు పాలు కల్గునా (రా)
Comments