meevalla gunadosha
ప. మీవల్ల గుణ దోషమేమి శ్రీ రామ
అ. నావల్లనే కాని నళిన దళ నయన (మీ)
చ1. బంగారు బాగుగ పదివన్నె గాకుంటే
అంగలార్చుచు బత్తునాడుకోనేల (మీ)
చ2. తన తనయ ప్రసవ వేదనకోర్వ లేకుంటే
అనయయల్లునిపై అహంకార పడనేల (మీ)
చ3. ఏ జన్మమున పాత్రమెరిగి దానంబీక
పూజించ మరచి వేల్పులనాడుకోనేల (మీ)
చ4. నా మనసు నా ప్రేమ నన్నలయ జేసిన
రాజిల్లు శ్రీ త్యాగరాజ నుత చరణ (మీ)
Comments