arabhi


ప. సాధించెనే ఓ మనసా

అ. బోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా పట్టిన పట్టు (సా)

చ. సమయానికి తగు మాటలాడెనే
స్వర సాహిత్య
స్వ1. దేవకి వసు దేవులనేకించినటు (సమ)

స్వ2. రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సాంప్రదాయకుడు (సమ)

స్వ3. గోపీ జన మనోరథమొసంగ
లేకనే గేలియు జేసే వాడు (సమ)

స్వ4. వనితల సదా సొక్క జేయుచును
మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను
ముద్దు పెట్ట నవ్వుచుండు హరి (సమ)

స్వ5. పరమ భక్త వత్సలుడు సుగుణ
పారావారుండాజన్మమనఘుడీ
కలి బాధల తీర్చువాడనుచు నే
హృదంబుజమున జూచుచుండగ (సమ)

స్వ6. హరే రామ చంద్ర రఘు కులేశ
మృదు సుభాష శేష శయన
పర నారీ సోదరాజ విరాజ తురగ
రాజ రాజ నుత నిరామయాపఘన
సరసీరుహ దళాక్షయనుచు
వేడుకొన్న నన్ను తా బ్రోవకను (సమ)

స్వ7. శ్రీ వేంకటేశ స్వప్రకాశ
సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్మకుట
కుండల విరాజిత హరేయనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడైన రామ చంద్రుడు (సమ)

చ. సమయానికి తగు మాటలాడెనే
సద్భక్తుల నడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే
అలుక వద్దనెనే
విముఖులతో చేర పోకుమనెనే
వెత కలిగిన తాళుకొమ్మనెనే
దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ
త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సా)


Comments

Popular posts from this blog

How to get started with Vue in under a minute?

aigiri nandini - Brodha V you rock