enta matramuna evvaru talachina anta matrame neevu



పల్లవి

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నత్లు



చరనం 1
కొలుతురు మిము వైష్నవులు కూరిమితొ విష్నుడని
పలుకుదురు మిము వెందంతులు పర బ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు



చరనం 2
సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువు
దరిమల మిమునే ఘనమని తలచిన ఘన భుద్ధులకు ఘనుడవు 



చరనం 3
నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరది దరి బావుల ఆ జలమె ఊరినయట్లు 
శ్రి వేంకటపతి నీవైతే మము చేకొని యున్న దైవము
శ్రి వేంకటపతి నీవైతే మము చెకొని యున్న దైవమని
ఈవలెనే నీ షరణనియెదను
ఇదియే పరతత్వము నాకు
ఇదియే పరతత్వము నాకు 
ఇదియే పరతత్వము నాకు !

Yato Vacho Nivartante Aprapya Manasa Sah
Beyond Words , Beyond mind .

Comments

Popular posts from this blog

How to get started with Vue in under a minute?

aigiri nandini - Brodha V you rock